ట్రిపుల్‌ఐటీలో నిధుల గోల్‌మాల్‌? | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీలో నిధుల గోల్‌మాల్‌?

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

ట్రిపుల్‌ఐటీలో నిధుల గోల్‌మాల్‌?

ట్రిపుల్‌ఐటీలో నిధుల గోల్‌మాల్‌?

కోట్ల రూపాయల లెక్కల్లో వ్యత్యాసాలు విద్యార్థి సంఘం ఆర్టీఐలకు సమాధానం కరువు క్యాంపస్‌లో అవినీతిపై టీఎస్‌ఏఎస్‌ ఆరోపణలు

భైంసా: బాసరలోని ఆర్జీయూకేటీలో నిధుల గోల్‌మాల్‌పై అక్కడి విద్యార్థి సంఘం ఆరోపణలు చేసింది. తెలంగాణ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోలిడారిటి ఆధ్వర్యంలో (టీఎస్‌ఏఎస్‌) పలు ఆరోపణలు చేశారు. ఈ విషయం అంతట చర్చకు దారితీస్తోంది. ఒక్కసారిగా క్యాంపస్‌లో ఆర్థిక పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల కేటాయింపులు, ఖర్చుల లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘం తరఫున ఆర్టీఐలో దరఖాస్తులకు సమాధానాలు రాకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ఆర్టీఐకి స్పందన లేక..

టీఎస్‌ఏఎస్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే క్యాంపస్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థి సంఘం ఆర్టీఐలో పలు దరఖాస్తులు చేసుకున్న స్పందన లేదు. ఆర్టీఐ ద్వారా 2019 నుంచి 2024 వరకు విద్యా సంవత్సరాల్లో ఖర్చు చేసిన నిధుల వివరాలు అడిగిన తగిన సమాచారం గడువులోగా రాలేదని వారు ఆరోపిస్తున్నారు.

పాతవారికే మెస్‌ టెండర్లు

పాతవారికే మెస్‌ టెండర్లు అప్పగించారని ఇక్కడ ఏమి జరిగినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. 2018 నుంచి కాంట్రాక్టు నిర్వహిస్తున్న వారికే గతేడాది నిర్వహించిన టెండర్లలో మళ్లీ మెస్‌లు అప్పగించారన్నది ప్రధాన ఆరోపణ. నిబంధనల ప్రకారం మెస్‌ నిర్వహణ కాంట్రాక్టు ఏడాది మాత్రమే ఉండాలి. రెండేళ్లకోసారి టెండర్లు నిర్వహించాలి. 2018లో టెండర్‌ పొందిన సంస్థ 2025 వరకు ఏడేళ్లపాటు కొనసాగడం గమనార్హం. ఇక బాసర క్యాంపస్‌కు కేటాయించే బడ్జెట్‌ ఖర్చు చేసే విధానంలో అవినీతి జరుగుతుందని తాజా ఆరోపణతో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయమే చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై క్యాంపస్‌ అధికారులకు ఫోన్‌లో సంప్రదించిన అందుబాటులోకి రాలేదు.

లెక్కల్లో తేడాలు

2019 నుంచి నిధుల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన నిధులు, ఖర్చుచేసిన వివరాలను పలు సందర్భాల్లో క్యాంపస్‌లో అడిగినా, ఆర్టీఐ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎలాంటి స్పందన లేదు. 2019–20, 2020–21, 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాల్లో కేటాయింపులకు అక్కడ ఖర్చుచేసిన విధానానికి పొంతన లేదన్నది ప్రధాన ఆరోపణ. బడ్జెట్‌లో కోట్ల రూపాయల నిధులు విడుదలైన అసంపూర్తి లెక్కలు ఉన్నాయని విద్యార్థి సంఘం ఆరోపించింది. అధికారులను పదేపదే ప్రశ్నిస్తున్న మౌనం విధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్పందన కరువు

ఓ వైపు క్యాంపస్‌లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని టీఎస్‌ఏఎస్‌ ఆరోపిస్తున్న పరిపాలన విభాగం ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. గత మూడు రోజులుగా టీఎస్‌ ఏఎస్‌ సోషల్‌ మీడియాలో ఈ విషయం చర్చ కు లేవనెత్తిన అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు. లెక్కల్లో సాంకేతిక లోపాలా, పరిపాలన పరమైన ఇబ్బంది అనేది ఎవరికి తెలియడం లేదు. ఈ ఆర్థిక వివాదం ఇప్పటికే సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మా రింది. ప్రజాధనంపై పారదర్శకతకు విద్యార్థులు గళమెత్తిన యాజమాన్యం స్పందన ఏమి టనే విషయంపై అందరి దృష్టి నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement