ఇసుక ట్రాక్టర్ పట్టివేత
భీమారం: మండలంలోని పోలంపల్లి శివారులోని రిజర్వు ఫారెస్ట్ గల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను శనివా రం అటవీ అధికారులు పట్టుకున్నారు. మంచి ర్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి రత్నాకర్‌రావు కథనం ప్రకారం.. పోలంపల్లి గ్రామానికి చెందిన బొల్లం శ్రీనివాస్ తన ట్రాక్టర్‌తో రిజర్వు ఫారెస్ట్ నుంచి ఇసుకను తరలిస్తుండగా ఆరెపల్లి సెక్షన్ ఆఫీసర్ సతీశ్ అడ్డుకున్నాడు. సతీశ్‌తో శ్రీనివాస్ వాగ్వాదానికి దిగి బలవంతంగా ఇసుక ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో వీడియో తీసి ఆధారాలతో పోలీసులు ఫిర్యాదు చేయగా వారు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అధికారిని అడ్డుకుని ట్రాక్టర్‌ను పట్టుకెళ్లిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు.
ఇసుక తరలిస్తున్న లారీ సీజ్
జన్నారం: పాత అనుమతితో ఇసుక తరలిస్తున్న లారీని అటవీ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ కథనం ప్రకారం..మంచిర్యాల వైపు నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న లారీని శనివారం ఇందన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద సిబ్బంది తనిఖీ చేశారు. వారు చూపించిన అనుమ తి పత్రం ఒక విధంగా, క్యూఆర్ కోడ్ ద్వారా పరి శీలించగా మరోలా ఉండడంతో మైనింగ్ అధికారులను సంప్రదించారు. లారీ తీసుకువచ్చిన క్వారీ నుంచి ప్రస్తుతం ఇసుక తోడటం లేదని గుర్తించా రు. క్యూఆర్ కోడ్‌లో ఈనెల 3న అనుమతి ఇచ్చి నట్లు ఉండడంతో లారీని సీజ్ చేసి రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇక నుంచి వే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని రేంజ్ అధికారి తెలిపారు.


