ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
ఉట్నూర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని లక్కారం పంచాయతీ పరిధిలోని నవోదయనగర్ గ్రామానికి చెందిన గాయక్వాడ్ బాలాజీ– రాజేశ్వరి దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో కుమారుడు గాయక్వాడ్ విజయ్ (23) డిగ్రీ పూర్తి చేసి ఉపాధి కోసం స్థానిక ఏటీసీ శిక్షణ తీసుకున్నాడు. కుటుంబానికి తోడుగా కూలీ పని చేసేవాడు. ఈనెల 15న శివరాత్రి రోజు స్నేహితులతో కలిసి గొడిసిర్యాల దేవస్థానానికి దర్శనం కోసం బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విజయ్‌ను ఉట్నూర్, ఆదిలాబాద్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
వాంకిడి: మద్యం తాగొద్దన్నందుకు ఒకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మ హేందర్ కథనం ప్రకారం.. మండలంలోని బ నార్ కొసార గ్రామానికి చెందిన నగోషే రవీందర్(31) గత కొంతకాలంగా మద్యానికి బాని సయ్యాడు. ఏ పని చేయకుండా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలోనే మద్యం మానేయాలని అతన్ని కుటుంబీకులు మందలించారు. మనస్తాపం చెందిన రవీందర్ శుక్రవారం రాత్రి చీరతో ఉరేసుకున్నాడు. భార్య స్వప్న ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.