రిమ్స్‌కు జాతీయస్థాయి గుర్తింపు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ రిమ్స్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్‌లో రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ విభాగం ప్రథమ బహుమతి తోపాటు నగదు అవార్డు సాధించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా రిమ్స్ బృందం ప్రదర్శించిన ప్రతి భకు పురస్కారం లభించడంపై కలెక్టర్ రాజర్షిషా హ ర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ పర్యవేక్షణలో హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీం సభ్యులు డాక్టర్లు పద్మవల్లి, సిమ్మి కుమారి, తంగాయి నాథన్, అనంత్ రావు, ఎస్‌ఎన్‌సీయూ బృందం సమష్టిగా కృషి చేసి శిశుఆరోగ్య విభాగంలో ఇన్ఫెక్షన్ల రేటు గణనీయంగా తగ్గించడంలో అద్భుత ఫలితాలు సాధించారని కొనియాడారు. వర్క్‌షాప్‌లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ సిమ్మి కుమారి సమర్పించిన పోస్టర్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుని ప్రథమ బహుమతికి ఎంపికై నట్లుగా తెలిపారు. రిమ్స్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు.


