మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం
చెన్నూర్: మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డుకు చెందిన మాదాసు శ్రీలత, మొండిలకు కమలం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం బీజేపీతోనే అభివృద్ధి జరుగుతుందని, అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజ యఢంకా మోగిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, మున్సిపల్ ఎన్ని కల కన్వీనర్ రాపర్తి వెంకటేశ్వర్, కో కన్వీనర్ గర్రెపల్లి వెంకటనర్సయ్య, నాయకులు కొండపాక చారి, ఏతం శివకృష్ణ, శ్రావణి, స్వరూపలు పాల్గొన్నారు.


