సేవలు విస్తరింపజేయాలి
దండేపల్లి: లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరామ్ సూచించారు. దండేపల్లిలో నిర్మించిన లయన్స్ క్లబ్ సేవాభవన్‌ను ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దండేపల్లిలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన అనతికాలంలోనే అనేక సేవాకార్యక్రమాలు చేపట్టి సొంతభవనం ని ర్మించుకోవడం అభినందనీయమని పేర్కొన్నా రు. అనంతరం స్థలదాత కొండు సత్తన్నను స న్మానించారు. క్లబ్ అధ్యక్షుడు కొండు జనార్దన్, కార్యదర్శి గడ్డం రాంచందర్, కోశాధికారి కల్లెం రాజన్న, జిల్లా చైర్‌పర్సన్ మాదంశెట్టి మల్లి కార్జున్, భద్రేశం, రమేశ్, సతీశ్, భూమేశ్, కిష న్, సుగుణాకర్, అంజిత్‌రావ్, లక్ష్మణ్, రామ న్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


