సిద్ధం చేయాలి
స్పష్టమైన
ఓటరు జాబితా
మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల్లో భా గంగా ముసాయిదా ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్ర య్య, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ మహ్మమద్ విలాయత్ అలీ, మంచిర్యాల ఆర్డీవోతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, పొరపాట్లపై మున్సిపల్ కమిషనర్‌కు రాత పూర్వకంగా అందిస్తే సవరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో 149 వార్డులకు గాను 2,94,641 మంది ఓటర్లు ఉన్నారని, మంచిర్యాల కార్పొరేషన్‌లో 264 పోలింగ్ కేంద్రాలు, లక్షెట్టిపేట బల్దియాలో 30, బెల్లంపల్లిలో 68, చెన్నూర్‌లో 36, క్యాతనపల్లిలో 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
మందమర్రిరూరల్: రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 37వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జాతీయ రహదారుల సంస్థ జీఎం(టీ) అండ్ పీడీ కేఎస్ అజయ్ మణికుమార్‌లతో కలసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నామని, సీటు బెల్టు ధరించాలని, వాహనదారులు ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని బెల్లపల్లి ఏసీపీ సూచించారు.


