విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ అధికారి(ఎస్‌ఈ) బి.రాజన్న అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టౌన్–3 గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల మేరకు వంగిన పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు, నేలపై తక్కువ ఎత్తు, కంచె లేని ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు సవరించామని, కొన్ని చోట్ల కొత్తవాటిని బిగించామని తెలి పారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కారా నికి చర్యలు తీసుకుంటారని అన్నారు. టోల్‌ఫ్రీ నంబరు 1912లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తమ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం వేసిన 33 కేవీ విద్యుత్ లైన్ కింద ఇళ్లు నిర్మించుకున్నామని, ఈ లైన్ ఇతర చోట నుంచి వెళ్లేలా చూడాలని వినియోగదారులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజేశం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వినియోగదారులు పాల్గొన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
నస్పూర్: రైతులు, వినియోగదారులు విద్యుత్ ప్ర మాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవా లని మంచిర్యాల విద్యుత్ శాఖ డీఈ మల్లేశం అన్నా రు. మంగళవారం ఆయన నస్పూర్‌లోని సీతారాంపల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా రైతులు, వినియోగదారులకు విద్యుత్ భద్రతా సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురమి ల్ల వేణు, విద్యుత్ శాఖ ఏడీఈ ఎన్.రాజశేఖర్, ఏఈ కే.రాంచందర్ పాల్గొన్నారు.


