రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడంతోపాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్‌ను ఆదేశించారు. ఆసుపత్రి లో సరిపడా మందులు అందుబాటులో లేవని ఎంపీ దృష్టికి రాగా, వెంటనే సరిపడా మందులు తె ప్పించి, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల ని సూచించారు. వార్డుల పరిశీలన అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో శంకర్ అనే వ్యక్తి తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని పరామర్శించారు.
నగరంలో పర్యటన
మంచిర్యాలటౌన్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం మంచిర్యాల నగరంలో పర్యటించారు. ప్రజ లతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్‌లో విక్రయదారులు, కొనుగోలుదారులతో ముచ్చటించారు. అనంతరం రతన్‌లాల్ హోటల్‌లో స్థానికులతో కలిసి టీ తాగి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.


