తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా తయారు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మంగళవారం మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్‌లోని డివిజన్లలో రూట్ మ్యాప్ ఇవ్వలేదని, ఒక్కో డివిజన్‌లో ఇష్టారీతిన ఓటరు జాబితాను ప్రచురించారని పేర్కొన్నారు. ఒక డివిజన్‌లోని ఓటర్లు మరో డివిజన్‌లోకి వేశారని, బీఎల్‌వోలు సరైన రీతిలో విధులు నిర్వర్తించకపోవడం, అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్క వారికి అనుకూలంగా తయారు చేశారని తెలిపారు. రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటరు జాబితాను ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని, సమయం పెంచి ఓటరు జాబితాలో అవకతవకలు సరిచేయాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, సీనియర్ నాయకులు బెల్లంకొండ మురళి, కాశెట్టి నాగేశ్వర్‌రావు, మంత్రి రామయ్య పాల్గొన్నారు.


