రాష్టస్థాయి పోటీల్లో విజేతలుగా తిరిగిరావాలి
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో ఉట్నూర్ క్రీడాకారులు సత్తాచాటి విజేతలుగా తిరిగి రావాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారుల బస్సులను మంగళవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఇటీవల కాలంలో గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా దుస్తులు, పీడీలు, కోచ్‌లకు టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీ అంబాజీ, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీవో సదానందం, ఆత్రం భాస్కర్, చందన్, ప్రకాశ్, కృష్ణారావు, ప్రేందాస్, ఉత్తం, గంగారాం, హేమంత్, మధుసూదన్, జైవంత్‌రావు, రవీందర్, జలపతి, తదితరులు పాల్గొన్నారు.


