తాతకు తలకొరివి పెట్టిన మనుమరాలు
నెన్నెల: సాధారణంగా ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు పురుషులు చేస్తారు. మృతి చెందిన వ్యక్తి తండ్రి అయితే ఇంటి పెద్ద కుమారుడు, తల్లి అయితే చిన్న కుమారుడు తలకొరివి పెట్టడం సంప్రదాయం. కానీ నెన్నెల మండలం ఆవుడంలో గంగిరెడ్డి లచ్చిరెడ్డి (55) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. అతని ఏకై క కుమార్తె బండం స్రవంతి సైతం గతంలోనే చనిపోయింది. స్రవంతి కూతురైన బండం హర్షిత ఆవుడంలో అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉండి చదువుకుంటోంది. మనుమరాలే కొడుకై తలకొరివి పెట్టి తాత రుణం తీర్చుకుంది. ఈ తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది.


