రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు

Jan 7 2026 7:52 AM | Updated on Jan 7 2026 7:52 AM

రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు కర్ను తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో పీడీ హీరాబాయితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement