జోనల్‌స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
ముధోల్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అండర్–23 బాసర జోనల్‌స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాజీరావు, ఎస్సై బిట్ల పెర్సీస్ పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు ఆదిలాబాద్, మంచిర్యాల టీంలు తలబడ్డాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ లావణ్య, క్రికెటర్ నయీముద్దీన్, కార్యదర్శి తుమ్మల దత్తు, బీజేపీ మండల అధ్యక్షుడు పోతన్న, మాజీ ఎంపీటీసీ మగ్ధూమ్, మేరోజ్‌ఖాన్, టీసీఏ అభయ్, రోళ్ల రమేశ్, మదన్ పాల్గొన్నారు.


