చేపల వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి
లోకేశ్వరం: గోదావరినదిలో చేపలుపట్టి కు టుంబాన్ని పోషించుకుంటున్న మత్స్యకా రుడు వలలో చిక్కుకు ని మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎ స్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన మాడబోయి చిన్న సాయన్న (50)మంగళవారం ఉదయం చేపలు పట్టేందుకు పంచగుడి గ్రామ సమీపంలోని గోదావరి నదికి వెళ్లి నీటిలో వల విసిరాడు. మధ్యాహ్నం సమయంలో వల తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతుని భార్య ఆనంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


