బెల్లం వ్యాపారి బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

బెల్లం వ్యాపారి బైండోవర్‌

Jan 7 2026 7:52 AM | Updated on Jan 7 2026 7:52 AM

బెల్లం వ్యాపారి బైండోవర్‌

బెల్లం వ్యాపారి బైండోవర్‌

ఇచ్చోడ: నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన బెల్లం వ్యాపారి ముక్క శ్రీనివాస్‌ను మంగళవారం తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ జుల్పీకర్‌ అహ్మద్‌ తెలిపారు. ఇచ్చోడ ఎకై ్సజ్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సదరు వ్యాపారి కొంత కాలంగా గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక విక్రయిస్తూ పలుమార్లు పట్టుపడ్డాడన్నారు. దీంతో తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి రూ.50 వేల నగదు చలానా రూపంలో ప్రభుత్వ ఖాతలో జమచేయించినట్లు తెలిపా రు. బోరిగామకు చెందిన రాథోడ్‌ ఉత్తం గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా బైండోవర్‌ చేసి రూ.15 వేల జరిమానా విధించినట్లు తెలిపా రు. ఇద్దరు వ్యక్తులు ఆరు నెలల కాలంలో మ రోసారి పట్టుబడితే రూ.లక్ష జరిమానా లేదా జైలుకు పంపించనున్నట్లు సీఐ తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు నాగోబా మహాపూజకు ఆహ్వానం

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 18న నిర్వహించే మహా పూజ, 22న దర్బార్‌కు హాజరు కావాలని మె స్రం వంశీయులు మంగళవారం ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్‌రెడ్డిలకు ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి హైదరాబాద్‌లో వారిని కలిశారు. నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌, సర్పంచ్‌ మెస్రం తుకారం, నాగో బా ఆలయ కమిటీ చైర్మన్‌ ఆనంద్‌రావ్‌, మెస్రం వంశీయులు బాదిరావ్‌పటేల్‌, నాగోరావ్‌, శేఖు తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ ఢీకొని 28 గొర్రెలు మృతి

లక్సెట్టిపేట: మండలంలోని సూరారం గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ ఢీకొని సుమారు 28 గొర్రెలు మృతి చెందినట్లు ఎస్సై సురేశ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట అశోక్‌నగర్‌కు చెందిన కర్రెపోలా గజలప్ప తమ గ్రామంలో గొర్రెలకు మేత లేకపోవడంతో దండేపల్లి మండలంలో మేపుతున్నాడు. మంగళవారం వాటిని మంచిర్యాల వైపు తోలుకెళ్తుండగా లక్సెట్టిపేట వైపు నుంచి మంచిర్యాల వైపు సిమెంట్‌ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో 28 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల యజమాని గజలప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

లాటరీ పేరిట ప్లాటు విక్రయించేందుకు యత్నం

బోథ్‌: సొనాల మండల కేంద్రానికి చెందిన తుమ్మ మహిపాల్‌ తన ప్లాటును లాటరీ వచ్చిన వారికి బహుమతిగా ఇస్తానని ఒక్కో టికెట్‌ రూ.2వేల చొప్పున విక్రయిస్తుండగా మంగళవారం బోథ్‌ పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని 13 లాటరీ టికెట్‌ బుక్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇలా లాటరీ పేరుతో ప్లాట్‌ల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement