నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు 24 మంది ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలీబిన్ అహ్మద్, తిరుపతి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో జోనల్ అండర్ 14 నెట్‌బాల్ బాలబాలికల ఉమ్మడిజిల్లా జోనల్‌స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మహేశ్వర్ మాట్లాడుతూ పోటీల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రథమస్థానం ఆసిఫాబాద్, ద్వితీయస్థానం ఆదిలాబాద్, తృతీయస్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయన్నారు. మూడు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది బాలురు 12 మంది బాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు అఖిల్, అజయ్, యోగి, అంకిలా, కవిత, ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.


