బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు సాధించాలి
రెబ్బెన: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు అన్నారు. మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో అండర్ 19 బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్ల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి రెండు రోజుల పాటు జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, షార్ప్‌స్టార్ బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మహేందర్, పీఈటీ భాస్కర్ పాల్గొన్నారు.
జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు
బాలుర జట్టుకు పి.సాయిచరణ్, డి.ప్రేందీప్, సీహె చ్ గోపాలక్రిష్ణ, సీహెచ్ నిఖిల్, సీహెచ్ వరుణ్, ఏ.నిఖిల్, ఎం.మారుతి, ఎం.కృష్ణ లోకానంద్, జి. కృత్విక్, ఆర్. అశిష్‌కుమార్, ఏ.సాత్విక్, వి.రాఘవ, డి.సిద్ధు, బాలికల జట్టుకు టి.ప్రజ్వల శ్రీ, పి.శ్రావ్య, ఎస్.సాయి శ్రీ వర్షిని, పి.సిరి, ఎస్.రిషిత, సీహెచ్ శ్రీ లక్ష్మిదేవి, డి. నందిని, జి హన్నా, పి.స్వాద్వి, జే శివాని, కే.సంకీర్తన, జే.దమ్మదీప ఎంపికై నట్లు అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు.


