గొర్రెల మందపై కుక్కల దాడి
భీమారం: మండల కేంద్రంలోని బస్డాండ్ సమీపంలోని బర్ల చంద్రయ్య ఇంటి ఆవరణలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో మూడు గొర్రె పిల్లలు మృత్యువాతపడ్డాయి. మరో రెండింటిని ఎత్తుకెళ్లాయి. చంద్రయ్య తన గొర్రెలను పగలు మేత కోసం అడవి ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి ఇంటి పరిసరాల్లో చుట్టూ రక్షణ చర్యలు చేపట్టి ఉంచుతారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో వీధికుక్కల గుంపు దాడిలో పలు గొర్రెలకు గాయాలయ్యాయి. మండల వెటర్నరీ అధికారి రాకేశ్‌శర్మ, వార్డు సభ్యుడు కోట రవి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన గొర్రెలకు వైద్యులు చికిత్స అందజేశారు. సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.


