దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
లైబ్రరీ ఏర్పాటు చేయాలి
నస్పూర్: నస్పూర్ మండల పరిధిలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు దుర్గం రఘు, మేడ వంశీకృష్ణ, కట్ల శ్రీనివాస్, శ్రీరాంపూర్, నస్పూర్ మండలాల యువకులు కలెక్టర్‌ను కోరారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారని, లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.


