మధుకు గద్దర్ అవార్డు
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన సీనియర్ డ్యాన్స్ మాస్టర్, కళాకారుడు హన్మాండ్ల మధు ప్రజాయుద్ధనౌక గద్దర్ అవార్డు అందుకున్నాడు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని జనవరి 1న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో మోక్షిత డ్యాన్స్ అకాడమీ, సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా జానపద నృత్య దర్శకుడిగా ప్రసిద్ధిగాంచిన మధుకు రిటైర్డు ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి
మంచిర్యాలటౌన్: రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని జర్నలిస్టులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రాయితీతో కూడిన రైల్వే పాసులను అందజేసేదన్నారు. మూడేళ్ల క్రితం వాటిని ర ద్దు చేసిందని, పునరుద్ధరించేందుకు కృషి చే యాలని కోరారు. స్పందించిన ఎంపీ రైల్వే మంత్రితో పాటు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
క్రీడలతో మానసికోల్లాసం
ముధోల్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో జరుగుతున్న విభాగ్‌స్థాయి ఖేల్‌కూద్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో శారీరక ధృడత్వం పెరుగుతుందని, స్నేహాభావం పెంపొందుతుందన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కబడ్డీ పోటీల్లో భైంసా, ఖోఖో పోటీల్లో ముధోల్, పరుగుపందెంలో ఆదిలాబాద్ (ప్రథమ), లాంగ్‌జంప్‌లో బజార్‌హత్నూర్ ప్రథమ,
మధుకు గద్దర్ అవార్డు
మధుకు గద్దర్ అవార్డు


