సింగరేణికి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.45 వేలకోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్‌లోని నరసయ్య భవన్‌లో నిర్వహించిన యూనియన్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బహిరంగసభకు సింగరేణి కార్మికులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, నాయకులు కొమురయ్య, రాచర్ల చంద్రమోహన్, అఫ్రోజ్ ఖాన్, ప్రసాద్ రెడ్డి బుచ్చయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న సింగరేణి
మందమర్రిరూరల్: సింగరేణి యాజమాన్యం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కార్మిక సమస్యలు పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కంటే ఈ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం అధికమైందన్నారు. యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి మల్లేశ్, రామకృష్ణాపూర్ కార్యదర్శి అక్బర్‌అలీ, నాయకులు చిప్ప నర్సయ్య, లింగయ్య, శ్రీనివాస్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.


