గెలిచిన సంఘాలు విఫలం
శ్రీరాంపూర్: ఎన్నికల్లో గెలిచిన సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం అయ్యాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆర్కే న్యూటెక్ గనిపై ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ కార్మికులకు రెండేళ్లలో సాధించింది ఏమీలేదన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన గెలిచిన తరువాత మోసం చేశారన్నారు. సింగరేణి కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన చరిత్ర టీబీజీకేఎస్‌కే దక్కుతుందన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిపై ఉన్న మమకారంతో కారుణ్య ఉద్యోగాలు, క్వార్టర్లలో ఉచిత విద్యుత్తు, లాభాల్లో అధిక శాతం వాటా వంటి అనేక హక్కులు కల్పించారన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరగా వారికి నేతలు కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు నూనె కొమురయ్య, సతీష్, సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్ రెడ్డి, లాల, వెంగళ కుమార్ స్వామి, దేవేందర్ శ్రీకాంత్, జైపాల్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, భగవాన్, తదితరులు పాల్గొన్నారు.


