ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి
మంచిర్యాలటౌన్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఓసీ నాయకుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని ఐదేళ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్య, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి రూ.10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని, టెట్ అర్హత పరీక్ష మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని కోరారు. తమ డిమాండ్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 11న సాయంత్రం 3గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఓసీల సింహగర్జన సభకు రాజకీయాలకు అతీతంగా ఓసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సభ పోస్టర్ ఆవిష్కరించారు. వివిధ సంఘాల నాయకులు మెట్టుపల్లి కిషన్‌రావు, రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారావు, రాజిరెడ్డి, ప్రకాశ్, శ్రీనివాస్, హరీశ్, శ్రీకాంత్, కమల్ కిశోర్, సురేశ్, రామారావు, మురళీధర్‌రావు పాల్గొన్నారు.
మున్నూరుకాపు కార్పొరేషన్..
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.


