‘సీపీఐది త్యాగాల చరిత్ర’
బెల్లంపల్లి: సీపీఐది త్యాగాల చరిత్ర అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్ పేర్కొన్నారు. బెల్లంపల్లిలో సీపీఐ చేపట్టిన జీపు జాతాను ఆదివారం ప్రారంభించారు. బజారు ఏరియాలోని దివంగత గుండా మల్లేశ్, సర్దార్ భగత్‌సింగ్ విగ్రహాలకు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ కంట్రోల్ కమిషన్ సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామితో కలిసి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ శత జయంత్యుత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అన్ని వర్గాల హక్కులు, సమస్యల పరిష్కారానికి సీపీఐ అలుపెరుగని పోరాట చేస్తోందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, బీ పూర్ణిమ, అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి దాగం మల్లేశ్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, అక్కెపల్లి బాపు, కొండు బానేశ్, బీ తిలక్ అంబేడ్కర్, మాణిక్యం, జీసీ మాణిక్యం, డీఆర్ శ్రీధర్, కే రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


