అడ్వకేట్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఏఎంసీ క్రీడా మైదానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వకేట్స్ ప్రీమియర్ లీగ్ మంచిర్యాల క్రికెట్ టోర్నమెంట్ శనివారం రాత్రి ముగిసింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ జట్టు విన్నర్స్‌గా, మంచిర్యాల బార్ అసోసియేషన్ జట్టు రన్నర్స్‌గా నిలిచాయి. ఇరుజట్లకు ముఖ్య అ తిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య బహుమతులు అందజేశారు. మంచిర్యాల సబ్ జడ్జి రామమోహన్‌రెడ్డి, బె ల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేశ్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం శివకుమార్, కార్యదర్శి చేను రవికుమార్, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


