ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువ
మంచిర్యాలటౌన్: జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం మంచిర్యాల కార్పొరేషన్ కార్యాలయంలో 37అ భ్యంతరాలు స్వీకరించారు. 49వ డివిజన్‌లో 3,187 మంది ఓటర్లతో డివిజన్ ఏర్పాటు చేసి ము సాయిదా జాబితాలో 3,823 మంది ఉన్నట్లుగా ప్రకటించారని డివిజన్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ అభ్యంత రం వ్యక్తం చేశారు. 503 ఓట్లు తొలగించేవి ఉన్నట్లుగా పేర్కొన్నారు. హైటెక్‌సిటీ కాలనీకి చెందిన బో డకుంట పుష్పలత, మహేందర్‌రెడ్డి 52వ డివిజన్‌లోని తమ కుటుంబ సభ్యుల ఓట్లు 21వ డి విజన్‌లోకి మారాయని తెలిపారు. 15వ డివిజన్‌కు చెంది న ఓటర్లను 14, 19వ డివిజన్లలోకి వేశారని, వాటిని 15వ డివిజన్‌లో చేర్చారని పేర్కొన్నారు. 23వ వా ర్డులోకి వెళ్లిన తమ ఓట్లను 39వ వార్డులోకి మార్చాలని లక్ష్మణమూర్తి వినతిపత్రం అందజేశారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో పదుల సంఖ్యలో ఓటర్లను ఓ వార్డు నుంచి మరో వార్డులో చేర్చారని, 20వ వార్డులో పంది మంది మృతుల పేర్లు తొలగించలేదని పలువురు అభ్యంతరం తెలిపారు. ఏళ్ల క్రితం పట్టణం వదిలి వెళ్లిన వారి పేర్లు తొలగించలేదని, ఒకే పేరు రెండు చోట్ల వచ్చాయని ఓటర్లు, పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న వారు మున్సిపల్ కార్యాలయంలో శనివారం వినతిపత్రాలు అందజేశారు. అభ్యంతరాలను పరిశీలించి తప్పులు దొర్లితే సవరణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తెలిపారు.
చెన్నూర్‌లో..
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీలో ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు సవరించాలని 25 మంది దరఖాస్తులు అందజేశారు. ఒక కుటుంబ సభ్యుల ఓట్లు రెండు మూడు వార్డుల్లోకి మార్చారని, ఒకే వార్డులోకి సవరించాలని కోరారు. ఈ నెల 8 నాటికి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఓటర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ తెలిపారు.


