గట్టు మల్లన్న క్షేత్రం అభివృద్ధి చేస్తాం
జైపూర్: ప్రసిద్ధిగాంచిన వేలాల గట్టు మల్లన్న క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని మండలంలోని వేలాల గట్టు మల్లన్నస్వామి 16వ గిరి ప్రదక్షిణలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పా ల్గొన్నారు. అనంతరం దొణలో మల్లన్న స్వామిని ద ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేలాల గ్రామం, గట్టు మల్లన్న స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాన్ని, రోడ్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులతో కలిసి గిరి ప్రదక్షణ పోస్టర్లు ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీఽనివాస్‌రెడ్డి, నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, ముక్త శ్రీనివాస్, విశ్వంభర్‌రెడ్డి, సర్పంచ్ డేగ స్వప్ననగేశ్ పాల్గొన్నారు.
మాలీలకు ఎస్టీ హోదాకు పార్లమంటు ప్రస్తావిస్తా
భీమిని: మాలీలకు ఎస్టీ హోదా కోసం పార్లమెంటులో ప్రస్తావిస్తానని, మాలీల హక్కుల కోసం పోరా డుతానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివా రం కన్నెపల్లి మండల కేంద్రంలో జ్యోతిరావుపూలే–సావిత్రీబాయిపూలే విగ్రహాలను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చేలా చూడాలని మాలీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చెండే సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. కన్నెపల్లి వాగు కోతకు గురికాకుండా కరకట్ట ఏర్పాటు చేయాలని, వీరాపూ ర్ దుబ్బగూడం ప్రాజెక్టు కాలువలను పునరుద్ధరించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో మా లీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్ల మొండి, పొలిట్ బ్యూరో సభ్యుడు లక్ష్మణ్, జిల్లా సంయుక్త కార్యదర్శి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగరావు పాల్గొన్నారు.


