చికిత్స పొందుతూ లోకో పైలెట్ మృతి
రెబ్బెన: మండలంలోని దేవులగూడ వద్ద ఆర్టీసీ లహరి బస్సును బొలెరో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రైల్వే లోకో పైలెట్ జితేందర్ కుమార్ బరియా(41) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బెల్లంపల్లి రైల్వే లోకో పైలెట్‌గా పనిచేస్తున్న జితేందర్ బరియా తన తోటి అసిస్టెంట్ లోకో పైలెట్ అమిత్ శర్వన్‌తో కలిసి గత నెల 23న తెల్లవారు జామున బొలెరోలో రెబ్బెనలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో దేవులగూడ వద్ద జాతీయ రహదారిపై ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ లహరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో బొలెరో బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో బొలెరో డ్రైవర్ కొమరే విజయ్ (25) అదే రోజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన జితేందర్ బరియాను హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని స్వస్థలం రాజస్థాన్‌లోని కోటా జంక్షన్. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.


