పాము కాటుకు బాలుడు మృతి
ఇంద్రవెల్లి: పాము కాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సకారంతాండలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బ ద్లుట్ దయరామ్, భాగ్యశ్రీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ (4) శుక్రవారం సాయంత్రం తోటి పిల్ల లతో కలిసి గ్రామ సమీపంలో గల రెగిచెట్టు వద్దకు వె ళ్లి పండ్లు తిన్నాడు. కొంతసేపటికి స్పృహతప్పి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు మండ ల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కాలుకు పాము కాటు వేసినట్లు అనుమానం ఉందని కుటుంబ సభ్యు లు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


