లారీ ఢీకొని ఒకరు దుర్మరణం
దండేపల్లి: మండలంలోని తాళ్లపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జన్నారం మండలం రాంపూర్‌కు చెందిన కోల మల్లయ్య (60) దుర్మరణం చెందాడు. దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. మల్లయ్య బైక్ రిపేర్ ఉందని ఇంటి నుంచి తాళ్లపేటకు బయల్దేరాడు. తాళ్లపేటకు చేరుకోగానే అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన మృతుడి బంధువు కాశయ్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఘటన స్థలికి చేరుకుని బోరున విలపించారు. తన భర్త మృతికి కారకుడైన లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవా లని మృతుని భార్య అసుమతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


