‘రక్షణాధికారిపై చర్యలు తీసుకోవాలి’
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని రక్షణాధికారి సంతోశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యాక్టింగ్ కోల్‌కట్టర్ బాదావత్ రమేశ్, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజునాయక్ శనివారం గని మేనేజర్ తిరుపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని ప్రసాదాన్ని సంతోశ్‌రావుకు ఇవ్వబోతే గిరిజనుడని ఇష్టం వచ్చినట్లు దూషించారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మేనేజర్‌ను కోరారు.
గూడెంలో పౌర్ణమి జాతర
దండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెంలో గల శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం పుష్యపౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 133 జంటలు సామూహిక సత్యనారాయణవ్రతాలు నోముకున్నాయి. జాతరకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జాతర సందర్భంగా గూడెం ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి.
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
తాండూర్: సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజనంపై ఆరా తీశారు. తానే స్వయంగా వడ్డించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొద్దిసేపు వారికి పాఠాలు బోధించారు.
‘రక్షణాధికారిపై చర్యలు తీసుకోవాలి’
‘రక్షణాధికారిపై చర్యలు తీసుకోవాలి’


