హోరాహోరీగా ఖేల్‌ఖూద్ పోటీలు
ముధోల్: మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శనివారం ఖేల్‌ఖూద్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సరస్వతి విద్యాపీఠం విభాగ్ అధ్యక్షులు భజరంగ్‌లాల్ అగర్వాల్, మండల విద్యాధికారి గోపిడి రమణారెడ్డి, ముఖ్యఅతిథి యార్లగడ్డ శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న పోటీల్లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, తదితర పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, జిల్లా కార్యదర్శి గోపాల్ కిషన్, ముధోల్ పాఠశాల సమితి అధ్యక్షులు రవీంద్రనాథ్ పాండే, కొండావార్ సంజీవ్, లోకేశ్వరం మాజీ ఎంపీపీ నగరం నారాయణరెడ్డి, రోళ్ల రమేశ్, ప్రధానాచార్యులు, ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు.
హోరాహోరీగా ఖేల్‌ఖూద్ పోటీలు


