‘ఎల్లంపల్లి’లో నీటమునిగి కౌలురైతు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రమాదవశాత్తు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీట మునిగి కౌలురైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పడ్తనపల్లికి చెందిన చిందం ఆంజనేయులు (38) గ్రామ శివారులో పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున పొలానికి నీరు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో పడిపోవడంతో ఈత రాక నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య సుమలత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
జోనల్ కార్యాలయం ప్రారంభం
లక్సెట్టిపేట: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కాళేశ్వరం జోన్ పరిధి జోనల్ కార్యాలయ భవనాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల భవనంలో శనివారం జోనల్ అధికారి గిరిజ ప్రారంభించారు. మంచిర్యాలలోని ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న భవనాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణానికి మార్చినట్లు తెలిపారు. జోనల్ స్థాయి సేవలన్నీ ఇక్కడి నుంచే లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వర్‌రావు, సిబ్బంది నవీన్, ధర్మేందర్, లక్ష్మణచారి, నాగరాజు, జ్యోతి, గీతాంజలి, శిరీష, తదితరులు పాల్గొన్నారు.
‘ఎల్లంపల్లి’లో నీటమునిగి కౌలురైతు మృతి


