బాసరలో భక్తుల సందడి
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో సందడిగా మారింది. వేకువజామున భక్తులు పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, ఎస్సై నవనీత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.


