భార్యపై గొడ్డలితో దాడి
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన గురుండ్ల సాయి అతడి భార్య వనితపై మద్యం మత్తులో గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో వనిత కాలు, చేతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిరోజులుగా సాయి మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. దీంతో క్షణికావేశంలో గొడ్డలితో శుక్రవారం దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


