నార్కొటిక్ జాగిలంతో తనిఖీలు
ఆదిలాబాద్‌టౌన్: నార్కొటిక్ జాగిలం రోమాతో ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ధన్‌గర్ మొహల్లలో సాహిల్ అహ్మద్ వద్ద గంజాయి ఉండడంతో రోమా అతడిని గుర్తించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా, పండించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా తయారు చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సీఐ వెంట ఎస్సై నాగనాథ్, రోమా జాగిలం హ్యాండ్లర్ రమేశ్ తదితరులున్నారు.


