నిందితుడికి రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: మహిళ చేతిలో నుంచి సెల్‌ఫోన్ చోరీకి పాల్పడిన నిందితుడు రాచర్ల రాకేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. గతనెల 29న మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన మోరె సంగీత ఆస్పత్రి పని నిమిత్తం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌కు రాగా, ఆమె చేతిలో నుంచి సెల్‌ఫోన్‌ను భోరజ్ మండలంలోని గూడ రాంపూర్‌కు చెందిన రాచర్ల రాకేశ్ లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.


