జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోగల హైదరాబాద్ కృష్ణవేణి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎస్కే షహబాజ్ నెట్‌బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 8న రాజస్థాన్ రాష్త్రంలోని బర్మర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ రామ్‌వేణు తెలిపారు. గత నెలలో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థి సత్తా చాటాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, పాఠశాల సిబ్బంది విద్యార్థిని శాలువాతో సన్మానించి జాతీయ పోటీల్లో మందమర్రి పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.
వాలీబాల్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఈ నెల 4నుంచి వారణాసిలో నిర్వహించనున్న జాతీయస్థా యి సీనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు పా ల్గొననున్నారు. అంకం అనుదీప్, ఎండీ షారు క్, అనూష ఎంపికయ్యారు. వీరిని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకుడు గాజుల ముఖేశ్‌గౌడ్, తాళ్లగురిజాల సర్పంచ్ వంగ రాముగౌడ్, వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బోరె యాదగిరి, బైరగోని సిద్ధయ్యగౌడ్, సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్, సీనియర్ క్రీడాకారులు తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక


