ఖందేవ్ చెంతకు తొడసం వంశీయులు
నార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామం వద్ద మాసే మాల్ పేన్‌కు తొడసం వంశీయులు గురువారం అర్ధరాత్రి పూజలు చేసిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఖందేవ్ పుణ్యక్షేత్రానికి ఎడ్లబండ్లపై వచ్చారు. కొందరు కాలినడకన ఆలయానికి పూజ సామగ్రితో చేరుకున్నారు. రాత్రి 9.30 గంటలకు పుష్య పౌర్ణమి సందర్భంగా ఖందేవుడికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశీయుల సమక్షంలో వంశ పెద్దలు మహాపూజలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం 9గంటలకు ఆదిలాబాద్ మండలం ఖండాల గ్రామానికి చెందిన తొడసం దుర్గుబాయి, దుర్గు దంపతుల కూతురు ఆదిలాబాద్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన సుర్పం సాక్రుబాయి, మల్కు వంశానికి చెందిన ఆడబిడ్డ దేవుని సన్నిధిలో వారి వంశం నుంచి సేకరించిన దాదాపు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొదటిసారిగా తన మొక్కు తీర్చుకోనుంది. తొడసం వంశీయులు భారీగా క్షేత్రానికి చేరుకోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం రూప్‌దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తొడసం నాగోరావు తెలిపారు.
మహాపూజకు ముస్తాబైన ఖందేవ్ ఆలయం
ఎడ్లబండ్లపై వస్తున్న తొడసం వంశీయులు
ఖందేవ్ చెంతకు తొడసం వంశీయులు


