కార్మిక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
మందమర్రిరూరల్: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితి ముగిసిందని అన్ని కార్మిక సంఘాలకు అధికారులు ప్రాధాన్యమివ్వాలని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియాలోని కేకే–ఓసీ ఆవరణలో ఆ యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు విజ య్‌కుమార్, పిట్ కార్యదర్శి మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు ఆ యూనియన్‌లో చేరగా వారికి హెచ్‌ఎంఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం రియాజ్‌అహ్మద్ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఆరోపించా రు. కేకే–ఓసీలో హెచ్‌ఆర్‌ఏ రాని ఉద్యోగులకు ఇ ప్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం యాజమాన్యం పక్షాన చేరడంతో కార్మికులు సమస్యలు పరిష్కరించేవారు లేరని ఆరోపించా రు. శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కార్మి కుల పక్షాన హెచ్‌ఎంఎస్ పనిచేస్తోందని, మహిళా ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. నాయకులు సుదర్శన్, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, అశోక్, రతన్‌సింగ్ తదితరులున్నారు.


