ఆటంటే మక్కువ.. నిత్య సాధన
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణానికి చెందిన పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. పట్టణంలోని ప్రైవేట్ క్రీడా మైదా నంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తూ ఆటపై తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన సీఎం క ప్ జిల్లాస్థాయి పోటీల్లో వీరు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆ తర్వాత నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో కడుకుంట్ల సాయికిరణ్, అల్లం సాయికుమార్, మాదాసు రంజిత్‌కుమార్, గర్కా గోపాలకృష్ణ, కెల్లేటి మనేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.
నిత్యం సాధన చేస్తున్నాం
నిరంతరం సాధన చేస్తే ప్రతి ఒక్కరూ ఫుట్‌బాల్ పోటీల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్‌లో మేము రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం. 16మంది జట్టుగా ఉన్న మేము నిత్యం సాధన చేస్తున్నాం. అందరూ పూర్తిస్థాయిలో సహకారమందిస్తేనే ఎంతోమంది క్రీడాకారులు రాణిస్తున్నారు.
– కడుకుంట్ల సాయికిరణ్
ఆటంటే మక్కువ.. నిత్య సాధన
ఆటంటే మక్కువ.. నిత్య సాధన


