ఓటు హక్కు వినియోగించుకోవాలి
చెన్నూర్‌రూరల్: ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు విని యోగించుకోవాల ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్, పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మూడవ విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్‌రావు పాల్గొన్నారు.
భద్రత మధ్య ఎన్నికలు
భీమారం: భద్రత మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నతపాఠశాల వద్ద ఏర్పాటు చేసి న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. మండలంలోని ఆన్ని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐలు నవీన్, అశోక్, ఎస్సై శ్వేత పాల్గొన్నారు.


