‘న్యాయవాదుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’
మంచిర్యాలక్రైం: న్యాయవాదుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని హైకోర్టు సీనియర్ న్యాయవాది, తెలంగాణ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. తె లంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన స్థానిక జిల్లా కోర్టును సందర్శించారు. బార్ అసోసియేషన్ ఇన్‌చార్జి అధ్యక్షుడు భుజంగరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. న్యాయవాదుల కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువ న్యాయవాదులకు స్టైఫండ్ అందేలా కృషి చేస్తానని తెలిపారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించా లని కోరారు. సీనియర్, యువ, మహిళా న్యాయవాదులు పాల్గొన్నా రు.


