ప్రజాతీర్పు నిక్షిప్తం
తాండూర్: బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండో విడతలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల ఎన్నిక ముగిసింది. ఆదివారం ఫలితాలు వెలువడగా గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నిక ల అధికారులు ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. మంగళవారం ప్రజాతీర్పును భద్రపర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మండలంలోని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాటు చేసిన బాక్సులను స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. ఒక్కో గ్రామానికి సంబంధించిన మొత్తం ఓట్లు ఒక్కో బాక్సులో వేసి సీల్ వేశారు. సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో మండలంలోని 15గ్రామాల బాక్సులను పోలీసుస్టేషన్‌లో భద్రపర్చారు. ఏడాది వరకు ఈ ప్రజాతీర్పు బాక్సులను భద్రంగా ఉంచుతారు.


