అన్నారం బ్యారేజీలో మంత్రుల ఇసుక దందా
మంచిర్యాలటౌన్: అన్నారం బ్యారేజీలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇసుక దందా చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు నడిపె ల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ రూ.83 వేల కోట్లయితే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారే జీ నిర్మించి సుందిళ్లకు నీటిని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే సుందిళ్ల బ్యారే జీ అని, అన్నారం బ్యారేజీని వినియోగించుకోకుండా పెద్దయెత్తున ఈ ప్రాంత ఇసుకను తరలిస్తూ మేడిగడ్డ, అన్నారంను ఇసుక కోసం ఎండబెడుతున్నారని ఆరోపించారు. చెన్నూరు ఎత్తిపోతల పథ కం కోసం రూ.1,603 కోట్లతో కేసీఆర్ శంకుస్థాపన చేసి షట్‌పల్లి వద్ద పంప్‌హౌజ్ పనులను ప్రారంభిస్తే నిలిపివేశారని తెలిపారు. చెన్నూరు డివిజన్, రామకృష్ణాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు, పార్క్, శ్మశాన వాటిక పనులు నిలిపివేశారని అన్నారు. చెన్నూరులో వందపడకల ఆసుపత్రి భవనం నిలిపివేశారని, బస్‌డిపోను రూ.4 కోట్లతో తెస్తే పక్కన పెట్టారని, ప్రజలకు సంబంధించిన అ భివృద్ధి, సంక్షేమ పనులు ఆపవద్దని సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో షట్‌పల్లిలో తమ పార్టీ కి చెందిన నాయకుడిపై హత్యాయత్నం జరిగింద ని, హత్యారాజకీయాలు సరికావని, ఇందుకు మంత్రి వివేక్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.


