దశాబ్దాల సేవలకు గుర్తింపేది?
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన విరమణ బెనిఫిట్స్ అందక పాట్లు వైద్యసేవలకు తప్పని ఇబ్బందులు నేడు జాతీయ పెన్షనర్ల దినోత్సవం
కై లాస్‌నగర్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించారు. ఉద్యోగ జీవితమంతా ఉరుకులు, పరుగుల మధ్య విధులు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ అనంతరం తమ కుటుంబంతో కలిసి శేషజీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మైంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక అనుకున్న కార్యక్రమాలను పూర్తిచేయలేని దుస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే నాణ్యమైన వైద్యసేవలు పొందలేని పరిస్థితి ఉంది. పెన్షన్ సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. తమకు రావాల్సిన ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పలుసార్లు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 8వేల మంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్ల సమస్యలు ఓసారి పరిశీలిస్తే..
బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం
రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం జీపీఎఫ్, జనరల్ ఇన్సురెన్స్, గ్రాట్యూటీ, కముటేషన్ లాంటి బెనిఫిట్స్‌ను ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. అయితే వీటి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పెన్షన్ మాత్రమే అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పించడం లేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లల వివాహాలు, ఉన్నత చదువులు, ఇంటి నిర్మాణాలు లాంటివి చేపట్టేందుకు ఆర్థికంగా అవస్థలు పడాల్సి వస్తోంది. వీటికి తోడు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఆకస్మాత్తుగా వచ్చే రుగ్మతలకు అవసరమైన వైద్య చికిత్స కోసం ఇబ్బంది పడుతున్నారు. నగదు రహిత వైద్యసేవలు అందించాలనే డిమాండ్ వారిలో వ్యక్తమవుతోంది.
రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు..


