గర్భస్థ శిశువు మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ నర్సింగ్‌హోంలో గర్భస్థ శిశువు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని కిరణ్ దాస్‌బస్తీకి చెందిన కుమ్మరి వసంత్, పద్మ దంపతులకు వివాహమై 20ఏళ్లు అవుతోంది. పిల్లల కోసం నర్సింగ్‌హోం వైద్యురాలి సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పద్మ గర్భం దా ల్చింది. ఈ నెల 15న ప్రసవానికి సమయం ఇచ్చా రు. దీంతో వైద్యురాలి సూచన మేరకు ఆ రోజు ఆ స్పత్రిలో చేరారు. గర్భస్థ శిశువు చనిపోయినట్లు గు ర్తించిన స్కానింగ్ నిర్వాహకులు వైద్యురాలికి తెలి పారు. దీంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యురా లు సూచించడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. ఆపరేషన్ ద్వారా శిశువును బయటకు తీయాలని వైద్యురాలు సూచించారు. పోలీసులు ఇరువర్గాలతో చర్చించి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు.
న్యాయం చేయాలని ఆందోళన
శిశువు మృతికి కారణమైన వైద్యురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాధితులు మంగళవారం మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. డబ్బులు చెల్లించే వరకు ప్రసూతి ఆపరేషన్ ఆలస్యం చేయడం కారణంగానే శిశువు మృతిచెందిందని ఆరోపించారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ ని సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. కాగా, వైద్యురాలు స్పందిస్తూ శిశువు ఉమ్మనీరు తాగిందని, పద్మ ఆరో గ్య పరిస్థితి సహకరించకపోవడంతో వేరే ఆసుపత్రి కి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. అన్ని విధాలా ప్రయత్నించామని, తమ తప్పు లేదని తెలిపారు.


