రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయాలి
పాతమంచిర్యాల: సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సింగరేణి పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్క్స్‌భవన్‌లో కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు ఉద్యమానికి కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హెఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్‌టీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్, టీఎస్‌యూఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, ఏఐఎఫ్‌టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల పోషమల్లు పాల్గొన్నారు.


