టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడి ఇంటిపై అగ్నిప్రమాదం
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గౌతమినగర్‌లో టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఇంటిపై గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఇంటిపై కంటెనయిర్‌లో ఒక గది, పీఓపీ, ఏసీ ఏర్పాటు చేశారు. ఇంటి పైనుంచి ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించింది. గది నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు.. శ్రీహరికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న మంటలార్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. ఫైర్ సిబ్బంది రాజేందర్, రమేశ్, శ్రీకాంత్, పోలీసులు తిరుపతి, రాకేశ్ పాల్గొన్నారు.


